పల్లవి :-

-----------

💃.మంచు కొండల్లోన చంద్రమా… చందనాలు చల్లిపో

మెచ్చి మేలుకున్న బంధమా… అందమంతా అల్లుకో

💃.మొగ్గ ప్రాయంలో, సిగ్గు తీరంలో… మధురమీ సంగమం

కొత్త దాహంలో, వింత మోహంలో… మనదిలే సంబరం

🕺🏿.పల్లవించుతున్న ప్రణయమా… మళ్లీ మళ్లీ వచ్చిపో

🕺🏿.విన్నవించుకున్న పరువమా… వెన్నముద్దులిచ్చిపో

కొంటె రాగంలో, జంట గానంలో… వలపుకే వందనం


చరణం.1.


💃.ఓహోహో

💃.ఊపిరల్లె వచ్చి… ఊసులెన్నొ తెచ్చి

ఆడిపాడి పేద గుండె… తట్టు తట్టు తట్టు తట్టు

🕺🏿.నింగి రాలిపోని… నేల తూలిపోని

వీడిపోని ప్రేమగూడు… కట్టి కట్టి కట్టి కట్టి

💃.తోడై నువ్వుంటే… నీడై నేనుంటా

🕺🏿.లోకం నువ్వంటా… ఏకం కమ్మంటా


💃.వలచి మరుజన్మలో… గెలిచి నిను చేరనా

🕺🏿.యుగము క్షణమై సదా… జగము మరిపించనా

💃.వెయ్యేళ్లు వర్ధిల్లు… కరగని, చెరగని, తరగని ప్రేమలలో


🕺🏿.పల్లవించుతున్న ప్రణయమా… మళ్లీ మళ్లీ వచ్చిపో

💃.మంచు కొండల్లోన చంద్రమా… చందనాలు చల్లిపో


చరణం.2

-------------

🕺🏿.వెన్నెలమ్మ మొన్న… కూనలమ్మ నిన్న

కన్నె వన్నెలన్ని చూసే… గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి

💃.గున్నమావికొమ్మ… సన్నజాజి రెమ్మ

ముచ్చటాడే నిన్ను నన్ను… మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి

🕺🏿.చిందే సింగారం… సిగ్గే సింధూరం

💃.పొందే వైభోగం… నాదే ఈ భాగ్యం


🕺🏿.కలయికల కావ్యమై… కలలు చిగురించెనా

💃.శ్రుతిలయల సూత్రమై… ప్రియుని జత కోరనా

🕺🏿.ఏడేడు లోకాల ఎల్లలు దాటిన… అల్లరి ప్రేమలలో


💃.మంచు కొండల్లోన చంద్రమా… చందనాలు చల్లిపో

🕺🏿.పల్లవించుతున్న ప్రణయమా… మళ్లీ మళ్లీ వచ్చిపో

💃.మొగ్గ ప్రాయంలో, సిగ్గు తీరంలో… మధురమీ సంగమం

🕺🏿.కొంటె రాగంలో, జంట గానంలో… వలపుకే వందనం

🕺🏿💃.ఆహా హా ఆహాహా……..

                                                   🌾మహాలక్ష్మి 🌾🎤

Comments

Popular posts from this blog