పల్లవి :-
------------
F:- మనసున మనసుగా నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా (2)
చరణం :-1
---------------
F:-మేఘం నేల ఒళ్ళు మీటే రాగమల్లే ప్రేమావరాల జల్లు కావా
M:-పిలుపే అందుకొని బదులే తెలుపుకొను కౌగిట ఒదిగి ఉండనీవా
F:-నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా
మల్లెపూల మాలై నిన్నే వరించి పూజించే వేళ
M:-నిరుక్షించు స్నేహం కోరి జతనై రానా రానా
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా
F:-నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట
M:-ఏడేడు జన్మలు నేనుంటా నీ జంట
మనసున మనసుగా నిలిచినా కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా
చరణం :-2
---------------
M:- పువ్వై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమా
F:-విరిసే చంద్రకళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమా
M:-కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై
వేటాడు ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
F:-నూరేళ్ళ కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై
నువ్వు నేను చెరి సగం అవుదాం వయస్సు పండించే వరమై
M:-ప్రియమైన అనురాగం పలికింది మధు గీతం
F:-తుదే లేని ఆనందం వేచేనే నీ కోసం
మనసున మనసుగా నిలిచినా కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
M:-దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం
F:-మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే
M:- కన్నుల్లో నీవే రావా.........
👌👌👌👌👌👌
ReplyDeleteముఖ్యంగా మీరు టైటిల్ పెట్టడం లేదు .. అందుకే గూగుల్ లో రావడం లేదు ..
ReplyDelete