పల్లవి :-
-----------
F:- జానకి కలగనలేదు రాముని సతి
కాగలనని ఏనాడు
M :- రాముడు అనుకోలేదు జానకి పతి
కాగలనని ఆనాడు
F :- ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు
మనకు నిజమైనది
M:- ఆ రామాయణం... మన జీవన పారాయణం
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
చరణం :-1
-------------
M:- చెలిమనసే శివధనస్సు అయినది తొలిచూపుల వశమైనది
వలపు స్వయంవరమైనపుడు గెలువనిది ఏది
F :- ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి
M :- తొలి చుక్కవు నీవే.. చుక్కాణివి నీవే
F :- తుదిదాకా నీవే.. మరు జన్మకు నీవే
M :- ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
F :- జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
M :- రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
చరణం :-2
-------------
F :- సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం
M :- సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం
ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం
F:- గతమంటే నీవే కథకానిది నీవే
M :- కలలన్ని నావే కలకాలం నీవే
Comments
Post a Comment